నన్ను చూడకముందు తను నా కోసం ఆరాటపడింది
చూసాక నేను తన కోసం ఆరాటపడ్డాను
భాందవ్యాలకు విలువిచ్చే ఓ మనిషి దొరికిందనీ…..
నా భావాలను అర్థం చేసుకునే అమ్మాయి తను అనీ…..
ఆశపడ్డాను….అనుసరించాను….!
కానుకలివ్వలేనంది……అవసరం లేదన్నాను!
తనకు బాధ్యతలు ఎక్కువంది……పంచుకుంటానన్నాను!!
ఆస్తులు లేవంది…..సంపాదిస్తానన్నాను!
అప్పులున్నాయంది…..తీర్చేస్తానన్నాను!!
నా సిద్ధాంతాలు తనకు నచ్చాయంది!
మన భావాలు చాలా కలిసాయంది!!
నాకేదో అయిపోయింది, అంతా నిజమే అనిపించింది
మనసు గోల చేసింది, ఊహలలో ఊగిసలాడింది
అంతలోనే తన అభిప్రాయం తెలిపింది,
లాగి ఒక్కటిచ్చింది, గూబ గుయ్ మంది!
దిమ్మ తిరిగిపోయింది, నాకు బుద్ధొచ్చింది,
మనసుకి చిన్న గాయమయ్యింది, మందేస్తే మానిపోయింది!
మొత్తం మీద అలా జరిగింది!!
నీతి: ఈ తొక్కలో సిద్ధాంతాలు చెప్పుకోవడానికి తప్ప పాటించడానికి పనికిరావు బాసూ….., కాదు కూడదు ఇది నా వ్యక్తిత్వం, వంకాయ అంటావా……ఇంక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు!
Thats was superb…loved it to bits.
chala bagundi.. manchi rythmic ga ..
raj it’s super u r great
raj it’s super.u r great